14-05-2025 12:39:00 AM
పెబ్బేరు ఎప్రిల్ 13: మండల కేంద్రం లోని కిష్టారెడ్డి ప్యాట, చెలిమిల్ల ఉమ్మడి గ్రా మంలో గ్రామ దేవత సంబరాలలో బాగం గా మంగళవారం మొలక కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 19న నిర్వహించే గ్రామ దేవతలు అయిన పెద్దమ్మ, కర్రెమ్మ ల ఉత్సవాలను పురస్కరించుకుని మొలకలు పోసే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భా గంగా బైండ్ల వాద్యాలతో, పూజారి గ్రామరైతుల ధాన్యం తో కొత్త కుండలలో మొలకల ఉత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.