14-05-2025 12:39:25 AM
- అమ్మవారి విగ్రహాన్ని తాకిన సూర్యకిరణాలు
కడ్తాల్, మే 13 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయంలో మైసమ్మ దేవత విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకిన అపురూప దృశ్యం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. మంగళవారం ఆలయంలోని అమ్మవారి విగ్రహంపై సూర్యకిరణాలు పడ టం స్థానికులు, భక్తులు గమనించారు.
మధ్యాహ్నం సమయంలో సూర్యుడి కిరణాలు అమ్మవారి విగ్రహంపై పడ్డాయి. దీంతో భక్తులు, స్థానికులు ఇదంతా అమ్మవారి మ హత్యంగా భావిస్తున్నారు. ఆలయా నికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. సూర్యభ గవానుడి ఆలయంలో ఇదే విధంగా మూలవిగ్రహంపై సూర్యకిరణాలు పడతాయి. ఇ ప్పుడు మైసిగండిలో కూడా అలాంటి అపురూపదృశ్యం కనిపించడంతో అందరు చ ర్చించుకుంటున్నారు. సూర్యకిరణాలు అమ్మవారి విగ్రహంపై పడటం భక్తులు, స్థానికులు చూసి ఇదంతా మైసమ్మ దేవత అనుగ్రహం వల్లే జరిగిందంటున్నారు.