14-05-2025 12:36:26 AM
నాగర్ కర్నూల్ మే 13 (విజయక్రాంతి)ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నప్పటికీ అధికారుల అలసత్వం రైతులకు శాపంగా మారు తోంది. ప్రాథమిక సహకార సంఘం, ఐకెపి, సివిల్ సప్లై, రెవెన్యూ శాఖల మధ్య కొరవడిన సమన్వయ లోపంతో వరి కొనుగోలు ఆలస్యం చేస్తూ చివరికి అకాల వర్షానికి ధా న్యం తడిసి అపారమైన నష్టాన్ని మిగులుస్తోంది.
చెమటోడ్చి కుటుంబమంతా కష్టపడి పండించిన పంటను అమ్ముకునే దశలోనే అ ధికారులు అలసత్వంతో రెక్కల కష్టం పూర్తి గా వర్షార్పణమవుతుంది. అక్కడక్కడ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కొనుగోలు కేం ద్రాలను సందర్శిస్తూ పలు సూచనలు సలహాలు ఇస్తూనే హెచ్చరికలు సైతం జారీ చేశా రు.
అయినప్పటికీ జిల్లా కలెక్టర్ ను సైతం లెక్కచేయకుండా సరైన సమయంలో గన్ని బ్యాగులు, టార్పిలీన్ న్ల కొరత, ధాన్యం తరలింపు లారీల కొరత మార్కెట్కు ధాన్యాన్ని తీసుకు వచ్చినప్పటికీ కొనుగోలు చేయడం లో అలసత్వం ఇలాంటి కారణాలవల్ల రైతు లు పండించిన ధాన్యం వర్షానికి తడిసి వర ద పాలవుతోంది. జిల్లాలోని 4 నియోజకవర్గాల వారీగా ఈ రభీ సీజన్ వరి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆయా మిల్లులకు తరలించేందుకు లారీల ఏర్పాటుకు టెండర్లను పిలి చారు.
రాజకీయ పార్టీల నేతలు తెరవెనుక లారీల తరలింపు అంశంలో కమిషన్లకు కక్కు ర్తి పడి లారీ డ్రైవర్లతో లారీ ఓనర్ అసోసియేషన్ పేర్లతో రాజకీయం చేస్తూ సరైన సం ఖ్యలో లారీలను ఏర్పాటు చేయకపోవడం తో చివరికి రైతులు తీవ్రంగా నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా కిందిస్థాయి అ ధికారుల అలసత్వం వెరిసి రైతులకు నష్టాన్ని తెచ్చి పెడుతోంది.
అక్కడక్కడ కొ నుగోలు కేంద్రాలను సందర్శించే క్ర మంలోనూ ఫోటోలకు ఫోజులిస్తూ కంటి తు డుపుగా తనిఖీలు చేయడంతో చివరికి ఎక్కడ వేసినగొంగడి అక్కడే అన్న చందంగా ఆయా కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు అక్కడే తిష్ట వేసి ఉన్నాయి. సోమవారం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సివిల్ సప్లై ఐకెపి, పిఎసి ఎస్, వంటి శాఖలతో పాటు కిందిస్థాయి సి బ్బందితో కలిసి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వరి కొనుగోలు అలసత్వంపై ప్రత్యేక సమీక్ష జరిపారు. ధాన్యం సరఫరాకు ఏర్పా టు చేసే లారీల కొరత ఎందుకొస్తుందంటూ ప్రశ్నించారు.
గన్ని బ్యాగులను కృత్రిమ కొరత సృష్టించడం ఏంటని నిలదీశారు. లారీలకు జిపిఎస్ ట్రా కింగ్ సిస్టం వెంటనే ఏర్పాటు చేయాలని ధాన్యం సరఫరా కో సం లారీలపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. అయి నా సంబంధిత అధికారు లు మాత్రం అలసత్వాన్ని వీడటం లేదు. తే మ, తాలు వంటి సాకులు చూపి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం ఆయా రైస్ మిల్లర్లు అన్లోడింగ్ అనుమతించడం లేదని తద్వారా లారీలన్నీ ఆ యా రైస్ మిల్లర్ల వద్దే పడిగాపులు తప్పడం లేదని ఆయా లారీ కాంట్రాక్టర్లు చెప్తున్నారు.
ఆయా రైస్ మిల్లర్లతో అధికారులు కుమ్మక్కై రైతులను ఇబ్బందులు పెడుతున్నా పట్టించుకోవడం లేద నే ఆరోపణలు పెరుగుతున్నాయి. కేవలం కొన్ని మి ల్లుల కు మాత్రమే ఎక్కువ శాతం దాన్యం కేటాయిస్తున్నారని దాని వెనక ఆంతర్యం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అకాల వర్షంతో తడిసిన ధాన్యం
సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం తో జిల్లా వ్యాప్తంగా ఆయా కొనుగోలు కేం ద్రా ల వద్ద రైతులు తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసింది అక్కడక్కడ గన్ని బ్యాగుల కొరత కారణంగా ఎండబెట్టిన ధాన్యం కూడా వర్షానికి మళ్లీ తడిసిందని వరద నీటిలో కొంత ధాన్యం కొట్టుకుపోయిందని రైతులు బోరుమంటున్నారు. మరికొన్ని కొనుగోలు కేం ద్రాల వద్ద టీమ శాతాన్ని పరీక్షించి ధాన్యం బస్తాలకు ఎత్తినప్పటికీ లారీల కొరత కారణంగా వర్షపు నీటిలోనే దాన్యం బస్తాలు తడిచాయని రైతులు మండిపడుతున్నారు.
మరికొన్ని కేంద్రాల నుండి ధాన్యం బస్తాలు ఆయా మిల్లులకు తరలించినప్పటికీ మిల్లు యజమానులుతేమ, తాలు పేరుతో కొర్రీలు పెట్టడంతో మిల్లుల వద్ద ధాన్యం వాహనాలు పడిగాపులు కాస్తున్నాయి. జిల్లా వ్యా ప్తంగా 1,60, వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యం ఉన్నప్పటికీ ఇప్పటిదా కా కేవలం 35,257 వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. 34, 228 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఆయా మిల్లులకు షిఫ్టింగ్ చేశారు. ఇంకా వెయ్యి మెట్రిక్ టన్నుల ధాన్యం ఆయా మిల్లుల వద్ద పడిగాపులు కాస్తుంది.
రభీ సీజన్ దాదాపుగా పూర్తి కావాల్సినప్పటికీ కేవలం 35 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించడంపై అధికారుల అలసత్వం ఏపాటిదో అర్ధమవుతోంది. జిల్లాలోని నాలుగు వ్యవసాయ మార్కెట్లలోనూ రైతులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో అమ్ముకునేందుకు తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా వర్షార్పణం అవుతుంది. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సైతం కిందిస్థాయి అధికారులకు, రైతులకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు ఉన్నాయి.
రైతులు ధాన్యాన్ని భద్రపరచుకోవాల్సిన షెడ్లలో కాంటదారులు, మార్కెటింగ్ శాఖ పాలకవర్గం అధికారులు వారి సంబంధించిన వాహనాలను ఏర్పాటు చేయడంతో రైతులు ఎండకు వానకు తడుస్తూనే టార్పిండ్ల కిందే తలదాచుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.
తగినన్ని లారీలు ఏర్పాటు చేశాం
4 నియోజకవర్గాల వారిగా కాంట్రాక్ట్ దక్కించుకున్న లారీ కాంట్రాక్టర్లు 25 లారీల చొప్పున తగినన్ని లారీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ధాన్యం ఒకేసారి ఎక్కువ శాతం ఆ యా కొనుగోలు కేంద్రాలకు తరలివస్తుంది అందుకు కొరత ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది.
రాజేందర్, సివిల్ సప్లై మేనేజర్, నాగర్ కర్నూల్.