వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలి
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి: మున్సిపల్ చైర్మన్ ఆకాష్
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 28(విజయక్రాంతి): రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు వడదెబ్బ నుంచి రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఆకాష్ సూచించారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ గజానంద్, వైస్ చైర్మన్ అహ్మద్లతో కలిసి కార్మికులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులు రోజూ తగినంత నీరు తాగాలని, సాధ్యమైనంత వరకు నీడలో ఉండి పనులు నిర్వహించాలని సూచించారు.
ఎండల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కమిషనర్ గజానంద్ తెలిపారు. ఈ క్రమంలో ఆర్‌ఆర్ కాలనీ, గోడవెల్లి ప్రాంతాల్లో ఉన్న వాటర్ ట్యాంకులను శుభ్రపరచి బ్లీచింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఇంటి పన్నును ఈ నెల 30లోపు చెల్లించిన వారికి 5 శాతం రాయితీ లభిస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు స్వప్నారాణి, భార్గవి, నాగుబాయి, లక్ష్మీ, సలాం పాల్గొన్నారు.






