క్రీడలతో మానసికొల్లాసం
నస్పూర్, ఏప్రిల్ 28 : క్రీడలతోనే మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని శ్రీరాం పూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. 25 రోజులు కొనసాగే శిబిరాలను మంగళవారం ప్రగతి స్టేడియంలో జీఎం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత క్రీడా శిక్షణా శిబిరాలను చిన్నారులు సద్వినియోగ పరుచుకోవాలన్నారు. సింగరేణి సంస్థ ప్రతీయేట నిర్వహించే ఉచిత క్రీడా శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఉద్యోగుల పిల్లలకోసం ఈ సారి ఐదు విభాగాల్లో వేసవి ఉచిత క్రీడా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ సదవకా శాన్ని ఉద్యోగులు పిల్లలు సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. శిక్షణ పూర్తిచేసుకున్న బాలబాలికలకు క్రీడా యూనిఫామ్ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీ ఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం శ్రీరాంపూర్ ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు , డీజీఎం ఎస్. అనిల్ కుమార్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి, డబ్ల్యూ పీ ఎస్ అండ్ జీ ఏ హానరరీ సెక్రటరీ సృజన్ పాల్, స్పోరట్స్ సెక్రటరీ అశోక్ పాల్గొన్నారు






