24 August, 2026 | 9:52 PM

Breaking News

చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •   ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం   •   చిలుకూరును డైరీ హబ్ గా తీర్చిదిద్దాలి   •   గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది   •   ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి   •   డ్రైవర్ కుటుంబానికి తోటి డ్రైవర్ల ఆర్థిక చేయూత   •   విద్యార్థులు కమ్యూనికేషన్, ఏఐ స్కిల్స్ పెంపొందించుకోవాలి   •  

గర్భవతిని మూడు నెలలలోపే గుర్తించాలి

18-06-2025 07:15 PM

డిఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): మాతా శిశు సంరక్షణ సేవలలో భాగంగా ప్రతి గర్భవతిని మూడు నెలలలోపే గుర్తించి వారికి సరియైన సేవలు సూచనలు చేయాలని డీఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్(DMHO Putla Srinivas) సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు, ఎమ్.ఎల్.హెచ్.పి. లకు, సూపర్వైజర్లకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ప్రజలకు నీటి ద్వారా, దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన పెంచాలని సూచించారు.

ఈ నెలాఖరులోపు కచ్చితంగా నూటికి నూరు శాతం సేవలు అందించాలని జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. కనగల్, పెద్దవూర, పీ.ఎచ్.సి. లలో మంచిగా సేవలందించినందుకు వైద్యాధికారులను మెచ్చుకున్నారు. ఈనెల 21 నాడు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా  ప్రతి సబ్ సెంటర్లో ఆరోగ్య కేంద్రాలలో ఉదయం ఏడున్నర వరకు యోగ డే నిర్వహించాలని సూచించారు. ఇందులో ప్రజలను ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం వహించేటట్టు చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ రవి , డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డాక్టర్ అరుంధతి , డాక్టర్ కృష్ణ కుమారి,  డాక్టర్ తిరుపతి రావు, డెమో  విష్ణు, డిపిఓ వైద్యాధికారులు సూపర్వైజర్ సిబ్బంది పాల్గొన్నారు.