5 March, 2026 | 5:24 PM

Breaking News

భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం రేవంత్   •   నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ షాక్‌తో రైతు మృతి.. కంగ్టిలో విషాదం   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •  

బాహుబలి3కి సన్నాహాలు

18-10-2024 12:25 AM

బాహుబలి3కి సన్నాహాలుదర్శకుడు ఎస్‌ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఈ చిత్రం రెండు భాగాలుగా వచ్చి భారీ విజయంతోపాటు కలెక్షన్లు వసూలు చేసింది. మూడో భాగం కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రియుల్లో ఉత్సాహం నింపే తాజా వార్త ఒకటి తెరపైకి వచ్చింది. కోలీవుడ్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బాహుబలి3’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి రెండు భాగాలకు తమిళంలో నిర్మాతగా జ్ఞానవేలే వ్యవహరించా రు.

ప్రస్తుతం ‘కంగువ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “గతవారమే ‘బాహుబలి’ మేకర్స్‌తో చర్చించాను. వారు మూడో భాగం ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. దాని కన్నా ముందు రెండు సినిమాలున్నా యి” అని జ్ఞానవేల్ చేసిన కామెంట్స్ ప్రస్తు తం సోషల్ మీడియాలో వైరల్‌గా మారా యి. ఇదిలా ఉండగా.. రాజమౌళి ప్రస్తుతం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ పనుల్లో నిమగ్నమై ఉన్నా రు. దీని తర్వాతే ఆయన ‘బాహుబలి3’ మొదలుపెట్టే అవకాశాలున్నాయని టాక్.