మధ్యంతర నివేదిక సిద్ధం
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరైన విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): కాళేశ్వరం ఆనకట్టలకు సంబం ధించి విజిలెన్స్ విచారణపై అదనపు సమాచారం అందించాలని జస్టిస్ సీపీ ఘోష్ విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా సోమవారం విజిలెన్స్ డీజీ, కమిషన్ ఎదుట హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుం దిళ్ల ఆనకట్టల అంశాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ గురించి ఆయన వివరిం చారు. మధ్యంతర నివేదిక సిద్ధంగా ఉందని సీవీ ఆనంద్ కమిషన్‌కు వివరించారు.
విచారణపై కమిషన్ అడిగిన అదనపు సమాచా రాన్ని అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ఆరా తీశారు. అదనపు సమాచారంతోపాటుతుది నివేదిక కూడా త్వరగా ఇవ్వాలని ఈ సందర్భంగా పీసీ ఘోష్ ఆదేశించారు. విచారణలో విజిలెన్స్ నివేదికే కీలకం కావడంతో దీనిపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ నివేదిక ఆధారంగానే తదుపరి విచారణ కొనసాగించేందుకు కమిషన్ నిర్ణయించి నట్లు సమాచారం. ప్రాజెక్టు రీ-డిజైనింగ్, నిర్మాణ స్థలం ఎంపిక, విధానపర నిర్ణయా లు, సంబంధిత అంశాలపై గత ప్రభుత్వ ముఖ్యులను ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
రేపటి నుంచి బహిరంగ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రేపటి నుం చి బహిరంగ విచారణ ప్రారంభించనుంది. ఇప్పటివరకు అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను బీఆర్కే భవన్‌లో విచారించనున్నా రు. కమిషన్ తరఫున మొదట న్యాయవాదిని నియమించుకోవాలని అనుకున్నప్పటికీ, వివి ధ కారణాలతో సాధ్యం కాకపో వడంతో నేరు గా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నా రు. అఫిడవిట్లలోని అంశాలవారీగా వారిని ప్రశ్నిస్తారు. బుధవారం ఘోష్ కమిషన్ నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్‌ను ప్రశ్నించనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటి వరకు 57 మంది అధికారు లు పీసీ ఘోష్ కమిషన్‌కు అఫిడవిట్లు దాఖలు చేయగా... మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఇంకా అఫిడవిట్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. కమిషన్ నుంచి మరోమారు ఆయనకు నోటీసులు పంపనున్నట్లు సమాచారం.






