చెరువుల పరిరక్షణ.. భవిష్యత్‌కు భద్రత
హైడ్రాకు అభినందనలు: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మారుతున్న మన హైదరాబాద్‌ను చూడటం నాకెంతో సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిని క్యూర్ చేసుకుంటూ..
మన చెరువులకు జీవం పోస్తూ.. భావితరాలకు జీవంతో నిండిన భవిష్యత్‌ను హైడ్రా అంకితం చేస్తున్నదని శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవానికి అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదు.. భావితరాల భవిష్యత్ భద్రపర్చడం కూడా. ప్రతి చెరువును కాపాడుతూ.. ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతాం’ అని పేర్కొన్నారు.






