19 April, 2026 | 9:13 AM

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

17-12-2024 05:00 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లోని హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రపతి ముర్ముకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ ఘన స్వాగతం పలికారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ద్రౌపదీ ముర్ము భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. ఈ నెల 21వ తేదీ వరకు ఇక్కడ బస చేయనున్నారు. రాష్ట్రపతి ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన తర్వాత రాష్ట్రపతి ముర్ము గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటలోని వాయుదళ శిక్షణ కేంద్రానికి చేరుకున్నారు.