12 August, 2026 | 1:35 AM

‘వందేమాతర’బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

12-08-2026 12:22 AM

న్యూఢిల్లీ, ఆగస్టు ౧౧: జాతీయ గేయం ‘జనగణమన’కు చట్టపరమైన భద్రత ఉన్న విధంగానే, వందేమాతర గీతానికి చట్టపరమైన భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ గౌరవ అవమానాల నిరోధక (సవరణ) బిల్లు -2026 తీసుకువచ్చింది. బిల్లును గత నెల 29న రాజ్యసభ ఆమోదించగా, ఇదే నెల ౩౦న లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.

దీంతో బిల్లు కాస్త, చట్టంగా మారనుంది. ఇకపై ఎవరైనా వందేమాతర గీతాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినా, ఆలపించేటప్పుడు అడ్డంకులు సృష్టించినా వారు శిక్షార్హులవుతారు. మరోవైపు, ఈ ౧౫న ఢిల్లీలోని ఎర్రకోటపై జరుగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారి ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.