12 August, 2026 | 1:33 AM

164కు చేరిన మృతుల సంఖ్య

12-08-2026 12:20 AM
  1. కొనసాగుతున్న సహాయక చర్యలు
  2. కొలంబియాను వణికించిన భూకంపం

బోగోటా, ఆగస్టు 11: కొలంబియా పశ్చిమ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య ౧౬4కు చేరింది. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశపు అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూకంపం వల్ల 87 మంది గాయపడగా, 2,700 మంది గల్లంతయ్యారు. సోమవారం పశ్చిమ కొలంబియా లో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కనీసం 77 మంది మరణించడమే కాకుండా, అనేక నగరాల్లో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.

ఈ భూకంపం పెరీరా, క్విబ్డో, కాలి, మనిజాలెస్ సహా అనేక పశ్చిమ నగరాలను ధ్వంసం చేసింది. అనేక నగరాల్లోని విమానాశ్రయాలలో విమాన సర్వీసు లను నిలిపివేశారు. ఈ విపత్తు నేపథ్యంలో దేశాధ్యక్షుడు అబెర్లార్డో డి లా ఎస్ప్రియెల్లా దేశవ్యాప్తంగా నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు.

భూకంపం వల్ల 1,500కు పైగా ఇళ్లు దెబ్బతినగా, 61 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో ఆరు నెలల చిన్నారిని సురక్షితంగా కాపాడారు. పసిఫిక్ ’రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో కొలంబియా ఉండటమే భూకంప తీవ్రతకు కారణమని నిపుణులు చెబుతున్నారు.