calender_icon.png 19 December, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సవాళ్లపై సదస్సులో చర్చ

19-12-2025 11:24:38 AM

రామోజీ ఫిల్మ్ సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఛైర్ పర్సన్ల నేషనల్ కాన్ఫరెన్స్

హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఛైర్ పర్సన్ల నేషనల్ కాన్ఫరెన్స్(National Conference) నిర్వహించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu), గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శీతక్క, టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం, యూపీఎస్సీ ఛైర్మన్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై సదస్సుల్లో చర్చించారు. వివిధ రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలు, పరస్పర సహకారంపై చర్చజరుగుతోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు సదస్సు కొనసాగనుంది. యూపీఎస్సీ ఛైర్మన్ రాష్ట్రపతి ముర్ముకు సిల్వర్ ఫిలిగ్రీ అందజేశారు. హైదరాబాద్ కు చెందిన కళాకారులు సిల్వర్ ఫిలిగ్రీ రూపొందించారు