calender_icon.png 19 December, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్

19-12-2025 11:04:22 AM

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో(Encounter) ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. భైరామ్‌గఢ్-ఇంద్రావతి ప్రాంతంలోని అటవీ కొండల్లో మావోయిస్టు కార్యకర్తలు ఉన్నారనే సమాచారం మేరకు జిల్లా రిజర్వ్ గార్డ్ బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. గురువారం సుక్మా జిల్లాలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎదురుకాల్పుల్లో, ఒక మహిళతో సహా మొత్తం 12 లక్షల రూపాయల రివార్డులు కలిగిన ముగ్గురు నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు.