19-12-2025 12:11:34 PM
హైదరాబాద్: లుంబినీ పార్కు(Lumbini Park), గోకుల్ చాట్ పేలుళ్ల కేసు దోషులు తెలంగాణ హైకోర్టును(Telangana High Court) ఆశ్రయించారు. నాంపల్లి ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని అభ్యర్థించారు. నేరస్థుల మానసిక ప్రవర్తన, ఆరోగ్య స్థితి, పశ్చాత్తాప స్థితిగతులపై ఇద్దరు మిటిగేటర్లను హైకోర్టు నియమించింది. కేసు విచారణను మరో బెంచ్ కు బదిలీ చేయాలని నేరస్థుల న్యాయవాది అభ్యర్థించారు. నేరస్థుల న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీల్ పిటిషన్ల విచారణను కోర్టు వాయిదా వేసింది.