04-07-2025 12:00:00 AM
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
కరీంనగర్, జూలై 3 (విజయ క్రాంతి): గత పాలకులు నగరంలో అభివృద్ధి పనుల పేర ప్రజాధనం దుర్వినియోగం చేశారని, అంచనాలు విచ్చల విడిగా పెంచి అశాస్త్రీయంగా నాణ్యతా లోపంతో పనులు చేయడం వల్ల రెండు సంవత్సరాలు గడువక ముందే ఎక్కడికక్కడ ఊడి పోతున్నాయని వీటి మీద విచారణ జరిపించాలని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ స్మార్ట్ సిటీ పనులు, కూడళ్ల సుందరీకరణ పనులలో నాణ్యత లోపిస్తుందని కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తే బిజెపి మాత్రం ఒక్క రోజు కూడా నోరు మెదపలేదని అందుకే ఆరోజే మేము వీరిద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉందని గుర్తించామని అదే నిజ మైందనిఅన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగర అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా రాలేదని బిజెపి నాయకులు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నగరంలోని స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా 159.24 కోట్లు విడుదల చేసిందని, సిఎం అస్యూరెన్స్ పనులకు సంబంధించి ముప్పు రెండు కోట్లకు గ్రాంట్ ఇచ్చిందని, పట్టణ ప్రగతికి సంబంధించిన రెండున్నర కోట్లు చెల్లించిందని, బిజెపి నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తుందని రాబోయే రోజుల్లో బల్దియాపై కాంగ్రెస్ జండా ఎగురవేయడం ఖాయమని నరేందర్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్, శ్రవణ్ నాయక్, చర్ల పద్మ, కట్ల సతీష్, ద న్నా సింగ్, ఖంరోద్దీన్, షబానా మహ్మద్, జ్యోతి రెడ్డి, ముల్కల కవిత, తిరుమల, హసీనా, కుర్ర పోచయ్య, సుదర్శన్, నెల్లి నరేష్, వంగల విద్యాసాగర్, తదితరులుపాల్గొన్నారు.