04-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, జూలై 3 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పేర్కొన్నారు. జగిత్యాల ని యోజకవర్గం రాయికల్ మండల కేం ద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ను గురువారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఒపి సేవలు, ఐపీ సేవలు, ల్యాబ్, ఐపీ రికారడ్స్, మెడికల్ ఫార్మసీలను పరిశీలించారు.
ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి పేషంట్లనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగు పరచాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలని ఆదేశించారు. రోజుకు ఎన్ని ఓపి కేసులు చూస్తున్నారో పరిశీలించారు. రోగులకు డైట్ ఫుడ్, పాలు, ఇడ్లీ, బ్రెడ్, ఫ్రూట్స్ వంటి పో షకాహార పదార్థాలు అందించాలని ఆదేశించారు. వర్షాకాలం మూలంగా ప్రబలే సీజనల్ వ్యాధులపట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. అనంతరం రాయికల్ మండలంలోని బోర్నపల్లి, ఇటిక్యాల గ్రామాల్లో రూ. 20 లక్షల వ్యయంతో జరుగుతున్న హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.
నిర్మాణ పనులు నాణ్యతతో కొనసాగించి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ , ఈపిఆర్వో లక్ష్మణరావు, ఎమ్మార్వో నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, సంబంధిత అధికారులున్నారు.