10 June, 2026 | 4:14 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

వెలకట్టలేని అభిమానం..

04-02-2026 12:06 AM
  1. వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, లక్ష్మారెడ్డి అభిమానులు

ఘనంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు..

1296 మంది స్వచ్ఛందంగా రక్తదానం..

ఫోటోలు దిగేందుకు గంటల తరబడి క్యూ లైన్

జడ్చర్ల, ఫిబ్రవరి 3: మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సీ లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా జడ్చర్ల పట్టణం అంతా గులాబీ మయం అయింది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు లక్ష్మారెడ్డి అభిమానులు వేలాదిగా తరలి రావడంతో పట్టణం అంతా సందడిగా మారింది. ఉదయం జడ్చర్ల కొత్త బస్టాండ్ ఫ్లై ఓవర్ నుంచి ప్రేమ్ రంగా గార్డెన్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు.

జై లక్ష్మారెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో అభిమానులు వెలకట్టలేని అభిమానం చూ పిస్తున్నారు. నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్, షాద్ నగర్ ప్రభుత్వ దవాఖాన తో పాటు మహబూబ్నగర్ బ్లడ్ బ్యాంకు వారు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.వివి ధ ప్రాంతాల నుంచి వచ్చిన 1296 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

ఆదరణ తగ్గని మాజీ మంత్రి...

అధికారంలో ఉన్న లేకున్నా ఆయనకు ప్రజల్లో మాత్రం ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనమే మంగళవారం జడ్చర్ల ప్రేమ్ రంక గార్డెన్స్ లో నిర్వహించిన ఆయన జన్మదిన వేడుకలు. లక్ష్మారెడ్డి బర్త్ డే సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రా మం వార్డు పల్లె నుంచి వేలాదిగా ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు తరలివచ్చారు.

ఆయనతో ఫోటో దిగేందుకు గంటల తరబడి వేచి ఉన్నారు. వందలాదిగా రక్తదానం చేసేందుకు కూడా యువత స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఏ ఒక్కరిని కూడా నిరుత్సాహపరచకుండా ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతూ ఆప్యాయంగా వారిని పలకరిస్తూ లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

జడ్చర్ల పట్టణం నుంచి కాకుండా గ్రామాల నుంచి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున గజమాలలు పూలదండ లు బొకేలు శాలువాలతో లక్ష్మారెడ్డి ని సన్మానించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పి మాజీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ప్రనిల్ చందర్, తదితర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.