14-01-2026 10:42:57 AM
న్యూఢిల్లీ: తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Modi) సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఆయన విషెస్ చెప్పారు. మన సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పండగ సంక్రాంతి అన్నారు. సంక్రాంతి పండగ.. మనందరినీ ఏకం చేసే ఐక్యతా స్ఫూర్తిని గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతులకు కృతజ్ఞతలు చెప్పడం వల్ల సమాజం మరింత బోలపేతమవుతోందని వెల్లడించారు. ప్రతి ఇంటా ఆనందం, చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధించాలని ప్రధాని మోదీ కోరుకున్నారు.