calender_icon.png 30 September, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ప్రధాని మోదీ అన్‌టోల్డ్ స్టోరీ ప్రదర్శన

30-09-2025 02:06:54 AM

  1. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో కార్యక్రమ నిర్వహణ

మేరా దేశ్ పహలే పేరుతో మోదీ జీవిత ప్రస్థానంపై దృశ్యకావ్యం  

ప్రతి ఒక్కరూ హాజరు కావాలిః కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి ):ప్రధానమంత్రి శ నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక జీవిత ప్రస్థానాన్ని నగర ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆయన జీవితంలోని అరుదైన, తెలియని ఘట్టాలను వర్ణిస్తూ రూపొందించిన మేరా దేశ్ పహలే - ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ శ్రీ నరేంద్ర మోదీ అనే ప్రత్యేక ప్రదర్శన హైదరాబాద్‌లో జరగనుంది.

ఈ కార్యక్రమాన్ని ప్రముఖ బాలీవుడ్ రచయిత, కళాకారుడు మనోజ్ ముంతాషిర్ శుక్లా నిర్వహించనున్నారు.ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ , గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ జీవిత ప్రయాణాన్ని వర్ణిస్తూ రూపొందించిన ఈ అపురూపమైన ప్రదర్శనను మనోజ్ ముంతాషిర్ నిర్వహించనున్నారు.

రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఒక సామాన్య వ్యక్తి నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈ ప్రదర్శన ద్వారా ఆవిష్కరించనున్నారు. ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమానికి నగరవాసులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.