30-09-2025 02:05:09 AM
ఆమోదం తెలిపిన ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి సమీపంలో ఉన్న రిధిరా జెన్ వద్ద ఒక ఫ్లాగ్షిప్ 5-స్టార్ బ్రాండెడ్ రిసార్టును రిధిరా గ్రూప్ అభివృద్ధి చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించి, దాని వెల్నె స్ టూరిజం విజన్ను ముందుకు తీసుకెళ్తోం ది. తెలంగాణ టూరిజం కాంక్లేవ్ 2025లో రాష్ట్ర యువజన అభ్యున్నతి, పర్యాటక, సాంస్కృతిక విభాగం నుంచి అధికారిక లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్‌వోఏ)ను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదు రిధిరా గ్రూప్ నిర్వాహకులు అందుకున్నారు.
సుమారు రూ.200 కోట్ల అంచనా వేయబడిన పెట్టుబడితో, 6 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ భారీ ప్రాజెక్టు 10,000 చదరపు అడుగులు గల గ్లోబల్ వెల్నెస్ సెంటర్, స్పా, ఉన్నత స్థాయి విల్లాలు, ప్రీమియం ప్లాట్లు కలిగిన 5-స్టార్ బ్రాండెడ్ రిసార్ట్‌ను ఏర్పాటు చేయను న్నారు. రిధిరా గ్రూప్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రితేష్ మస్తిపురం మాట్లాడు తూ.. “మా దార్శనిక ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించినందుకు సంతోషిస్తున్నాము. ప్రభుత్వం సహకారంతో, మేము సకాలంలో, సజావుగా అమలు చేయగలమని నమ్ముతున్నాము” అని అన్నారు.