రిజర్వేషన్లపై ప్రధాని స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి

02-05-2024 01:58:31 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై ప్రధాని నరేంద్రమోదీ స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని, బీజేపీ వైఖరిపై బీసీలకు అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బుధవారం     బీసీ సంఘాల నాయకులతో కలిసి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో బీజేపీ బీసీలకు చేసిందేమీ లేదని మండపడ్డారు. కులాల వారీగా లెక్కలు తీయాల్సిందేనని డిమాండ్ చేశారు. దమాషా ప్రకారం రిజన్వేషన్లు కేటాయించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని అన్ని పార్టీలు కోరినా, నాడు బీజేపీ ప్రతిఘటించిందన్నారు.

పదేళ్లలో బీసీ రిజరేషన్లను 50 శాతానికి పెంచే అవకాశం ఉన్నా బీజేపీ ప్రభుత్వం పెంచలేదన్నారు. ంద్ర బడ్జెట్‌లో బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని ఉద్యమాలు చేసినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని గుర్తించి భర్తీ చేసి ఉంటే బీసీలకు మేలు జరిగేదన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా100 మంది ఐఏఎస్ కేడర్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటే, వారిలో కేవలం బీసీలు ముగ్గురేనన్నారు. ప్రధాని మోదీ కార్పొరేట్ దిగ్గజాల కోసం రూ.16 లక్షల  కోట్ల బ్యాంకు రణాలను మాఫీ చేశారని ఆరోపించారు. అగ్ర కులాల్లో పేదలశాతం 3 ఉంటే, వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.