ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి అర్బన్, మార్చి 9 (విజయక్రాంతి): కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రధాన మంత్రి - సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పోస్టర్ ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ TGREౄCO ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమ లో భాగంగా పీఎం - సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ప్రతీ విద్యుత్ వినియోగదారుడు తమ ఇళ్ల రూఫ్ టాప్ పై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని, కర్భన ఉద్గారాలు జీరో స్థాయికి తేవాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపల్ పరిధిలో అవగాహన కల్పించాలని సూచించారు. మూడు కిలోవాట్ల సోలార్ పలకలు ఏర్పాటు చేసుకొంటే కేంద్ర ప్రభుత్వం రూ.78 వేలు సబ్సిడీ అందిస్తుందని, దాంతో పాటు ప్రతీ నెలా రూ.2 వేల విద్యుత్ బిల్లు అదా చేయవచ్చని తెలిపారు.
పెట్టుబడి 5 సంవత్సరాల్లో తిరిగి వస్తుందని అన్నారు. సోలార్ విద్యుత్ పర్యావరణ హితమని తెలిపారు. మిగులు విద్యుత్ ను గ్రిడ్ కు ఇస్తూ అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని , ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్-రెవెన్యూ .వి. విక్టర్, ACLB మధుమోహన్ , జిల్లా ప్రజా సంబంధాల అధికారి . తిరుమల, TGREౄCO జిల్లా మేనేజర్ E. రమణ, AFO జగదీప్ రామ్ పాల్గొన్నారు.




