12 May, 2026 | 10:53 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

కైలాష్‌కు ప్రధాని కితాబు

24-02-2025 01:05 AM
  1. గిరిజన భాషల పరిరక్షణలో ఆదిలాబాద్ ఉపాధ్యాయుడు
  2. ఏఐతో కొలామి భాషలో పాట కంపోజ్
  3. 119వ ‘మన్‌కీ బాత్’ ఎపిసోడ్‌లో కొనియాడిన మోదీ
  4. కొత్త టెక్నాలజీ వినియోగంలో భారతీయులు ఎవ్వరికీ తీసిపోరని వ్యాఖ్య

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు తొడసం కైలాశ్ సేవలను ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. కృత్రి మ మేధ(ఏఐ) సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కంపోజ్ చేయ డం ద్వారా గిరిజన భాషలను పరిరక్షించడం లో కైలాష్ తమకు సాయం చేసినట్టు ప్రధా ని వెల్లడించారు.

‘మన్‌కీ బాత్’ 119వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ ఆదివారం పాల్గొని మాట్లాడారు. కొత్త టెక్నాలజీలను వినియోగించుకోవడంలో భారతీయులు ఎవరికీ తీసిపోరని ప్రధాని పేర్కొన్నారు. పారిస్ వేది కా జరిగిన ఏఐ సమ్మిట్ విశేషాలను ప్రజలతో పంచుకునే సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ రంగంలో భారత్ పురోగతిని ప్రపంచం గుర్తించి ప్రశంసించినట్టు వెల్లడించారు.  

ఇస్రో తన 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడాన్ని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ఈ విజయం యావత్ దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ఏటా పురోగతి సాధిస్తున్నట్టు పేర్కొన్న ప్రధాని.. గత 10 సంవత్సరాల్లో ఇస్రో దాదాపు 460 ఉపగ్రహాలను లాంచ్ చేసినట్టు వెల్లడించారు. ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం పెరగడం మంచి పరిణామమ న్నారు. ఈ క్రమంలోనే నేషనల్ సైన్స్ డే గురించి ప్రధాని ప్రస్తావించారు.

యువత, పిల్లలు ఏదైనా ఒక రోజును ఎంపిక చేసుకుని ఆ రోజు మొత్తం శాస్త్రవేత్తగా వ్యవహ రించాలని పిలుపునిచ్చారు. ఇలా చేయడం ద్వారా సైన్స్‌పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. అంతేకాకుండా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు తన సోషల్ మీడి యా ఖాతాలను నిర్వహించే అవకాశం మ హిళలకు ఇవ్వనున్నట్టు ప్రధాని ప్రకటించారు. అలాగే భారత్ ఆరోగ్యవంతమైన దేశంగా మారాలంటే ఊబకాయం సమస్య ను  పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు.

ఓ అధ్యాయనం ప్రకారం ప్రతి 10 మందిలో ౮మంది ఊబకాయంతో బాధపడుతున్నట్టు చెప్పారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వంటనూనె వాడకాన్ని తగ్గించాలన్నారు. ఈ క్రమంలోనే జావెలిన్ త్రోయర్ నీరజ్‌చోప్రా, బాక్సర్ నిఖత్.. ఊబకాయంపై ప్రజలకు అవగాహన కల్పించారు.