22 April, 2026 | 1:23 AM

నామినేటెడ్ పోస్టుల్లో వడ్డెరలకు ప్రాధాన్యత

22-04-2026 12:00 AM

-వడ్డెర సంక్షేమ భవనాన్ని పూర్తి చేస్తా  

మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ టౌన్, ఏప్రిల్ 21: నామినేటెడ్ పోస్టులలో వడ్డెరలకు తగిన ప్రాధాన్యత ఇస్తానని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అఖిలభారత వడ్డెర సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టానికి మారుపేరు వడ్డెరులు అన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టు పనులతో పాటు నిరంతరం కష్టపడుతూ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి రావలసిన పెండింగ్ బిల్లు అన్నింటిని విడుదల చేశామన్నారు. వచ్చే నెలలో భర్తీ చేసే నామినేటెడ్ పోస్టులలో వడ్డెరులకు ప్రాధాన్యత కల్పిస్తామని, వడ్డెరలకు సంబంధించి ఏ సమస్య ఉన్న వారిని సీఎం దగ్గరికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో వడ్డరుల సంక్షేమ సంఘం భవనాన్ని పూర్తి చేయిస్తా అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,జగద్గురు ఇమ్మడి సిద్ధ రామేశ్వర స్వామి,సభ అధ్యక్షులు అలకుంట్ల నాగరత్నం రాజు, రాష్ట్ర అధ్యక్షులు మంజుల రమేష్‌ఎంబీసీ చైర్మన్ జరిపేటి జైపాల్,స్రీ,శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గోగుల సరిత, జిల్లా అధ్యక్షులు వేముల సుధాకర్, జాతీయ ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.