11 July, 2026 | 8:33 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యం

23-06-2025 12:04 AM
  1. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు డివిజన్ లో రూ.కోటితో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పటాన్ చెరు, జూన్ 22 : పటాన్ చెరు డివిజన్ పరిధిలో  కాలనీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ అసవరమైన నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.   పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీ, అంబేద్కర్ కాలనీ, బండ్లగూడ కాలనీలలో రూ.కోటి అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. 

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్ చెరు డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి కాలువలు, వీధి దీపాలు, పార్కుల ఏర్పాటుకు ప్రాధన్యాత ఇస్తున్నామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు అఫ్జల్, వెంకటేష్, హెచ్‌ఎండబ్ల్యూఎస్ డీజీఎం శివకృష్ణ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ 

పటాన్ చెరు డివిజన్ ముదిరాజ్ బస్తిలోని పోచమ్మ తల్లి దేవాలయం ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమ ఆహ్వాన పత్రికను  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముధిరాజ్ సంఘం నాయకులతో కలిసి ఆదివారంఆవిష్కరించారు.