11 July, 2026 | 9:38 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం

23-06-2025 12:05 AM

కొత్తపల్లి, జూన్ 23 (విజయ క్రాంతి): చింతకుంట చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన స ర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర భుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఈజేఎస్ కింద 40 లక్షల ఈత, 5 లక్షళ తాటి మొక్క లు నాటుతున్నామన్నారు.

మొక్కలు సిద్ధం గా ఉన్నాయని , గౌడ సంఘ నేతలు ప్రభు త్వ స్థలాలు గుర్తించి అధికారుల దృ ష్టికి తీసుకురావాలని, ఆ స్థలాల్లో మొక్కలు నా టాలన్నారు. కల్లు కల్తీలేకుండా ఉంటే ఔష దం లాంటిదని, కల్లు కాంపౌండ్లకు నిధులిస్తామన్నారు. చింతకుంటలో కల్లు కాంపౌం డ్ నిర్మించుకుంటే 5లక్షలు కేటాయిస్తామని తెలిపారు.సర్వాయి పాపన్న స్ఫూర్తిని అంద రూ అందిపు చ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.