ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా సేవలందించాలి
కరీంనగర్/హుజూరాబాద్, మే 24 (విజయక్రాంతి): ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం హుజూరాబాద్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆమె సందర్శించి వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలందిం చాలని, సాధారణ ప్రసవాలు పెరిగేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌వో బీ చందు, ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో సునీత, వైద్యులు పాల్గొన్నారు.
యూనిఫామ్స్ కుట్టు కేంద్రం పరిశీలన
విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ ఏడాది పాటు ధరించేలా మన్నికగా కుట్టించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. మానకొండూర్‌లోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. జూన్ 5 వరకు యూనిఫామ్స్ సిద్ధం చేయాలని సూచించారు.
-కలెక్టర్ పమేలా సత్పతి






