11 August, 2026 | 8:51 PM

సింగరేణికి సాంకేతిక సహకారం అందిస్తాం

25-05-2024 03:40 AM

ఆస్ట్రేలియా ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్ డెనిస్ ఈటెన్

భద్రాద్రి కొత్తగూడెం, మే 24 (విజయక్రాంతి): సింగరేణి సంస్థకు రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనకు అవసరమైన ఆధునిక మైనింగ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతికత విషయాల్లో సహకారం అందిస్తామని ఆస్ట్రే లియా దేశ ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్ డెనిస్ ఈటెన్ హామీ ఇచ్చారు. శుక్రవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి డైరెక్టర్లు ఎన్‌వీకే శ్రీనివాస్, జీ వెంకటేశ్వరరెడ్డి, డీ సత్యనారాయణతో సమావేశమ య్యారు.  ఈ సందర్భంగా డెనిస్ ఈటెన్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా దేశంలో బొగ్గు రంగంలో అమలవుతున్న సాంకేతికతను, వ్యాపార అవకాశాలను తెలుసుకోవడానికి ఆస్ట్రేలియాలో పర్యటించాలని సింగరేణి అధికారులను ఆహ్వానించారు. అనంతరం కొత్తగూడెం ఏరియాలో పద్మావతిఖని మైన్‌ను డెనిన్ ఈటెన్ బృందం సందర్శించింది. కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జీఎం ఎం షాలెంరాజు, పీవికే 5 ఇంక్లున్ ఏజెంట్ బీ రవీందర్, గని మేనేజర్ పీ శ్రీనివాస్, రామకృష్ణ పాల్గొన్నారు.