9 July, 2026 | 2:33 AM

ప్రైవేట్ (రా)బడి!

09-07-2026 01:37 AM
  1. స్కూల్స్ @ లాస్ లేని బిజినెస్
  2. ఉమ్మడి జిల్లాలో 782 ప్రైవేటు స్కూల్స్
  3. ఓవైపు బుక్స్, డ్రెస్ల విక్రయాలు..
  4. మరోవైపు భారీ ఫీజులు వసూళ్లు
  5. నర్సరీకే రూ.20 వేల నుంచి రూ.30వేలు
  6. బుక్స్, డ్రెస్లకే రూ.130 కోట్లు
  7. ఫీజుల రూపంలో రూ.800 కోట్లు
  8. పట్టించుకోని అధికార యంత్రాంగం
  9. అవస్థలు తప్పక తల్లిదండ్రుల అయోమయం

నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన రవి(పేరు మార్చాం) ఓ ప్రైవేటు ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలు.. నెలకు రూ.30వేల జీతం. బతుకుదెరువు కోసం కేతేపల్లి మండలం నుంచి ఇక్కడికొచ్చాడు. పోటీ ప్రపంచంలో తాను ఒకడినంటూ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూల్లో తన ఇద్దరు పిల్లలను జాయిన్ చేశాడు. ఒకరు ఫస్ట్ క్లాస్. ఫీజు అక్షరాల రూ.38వేలు. మరొకరు నాలుగో తరగ తి. ఫీజు రూ.46వేలు. ఇద్దరికీ కలిపి రూ. 84వేలు ఒక్క ఫీజే. బుక్స్, డ్రెస్లు, సాక్సులు, బ్యాగులు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు ఇతరత్రాలు కలుపుకుని ఇటీవల రూ.40 వేలు ఖర్చయ్యాయి. మొత్తంగా ఏడాదికి రూ.1.24 లక్షల నుంచి రూ.1.50 లక్షల వర కు వ్యయం అవుతుంది.

రవికి ఏడాదంతా కలిపితే కటింగులు పోనూ రూ.3 లక్షలు వ స్తాయి. ఇందులో తన పిల్లల చదువుకే రూ. 1.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మిగిలిన దాంట్లో ఏడాదంతా కుటుంబాన్ని నెట్టుకురావడం సాధ్యం కాని పని. పైగా పిల్లలు అనా రోగ్యం పాలయితే ఆస్పత్రి ఖర్చులు.. ఇంటికాడ వృద్ధాప్యంతో బాధపడుతున్న తల్లిదం డ్రుల పోషణభారం. వచ్చిపోయే చుట్టాలు. పెండ్లిళ్లు.. శుభకార్యాలు.. అనుకోని ఖర్చు లు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతడంతా అవుతుంది. దీంతో అప్పుల కుప్ప రవి నెత్తిపై పడుతోంది. ఇది ఒక్క రవి పరిస్థితే కాదు. ఇలాంటి వారు ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు.

నల్లగొండ టౌన్, జూలై 8 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రైవేటు స్కూళ్లలో ఏటా రూ.వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ నడుస్తోంది. బుక్స్.. డ్రెస్లు.. ఫీజులం టూ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు వి ద్యార్థుల తల్లిదండ్రులు రక్తం జలగల్లా పీల్చేస్తున్నాయి. ఒక్కో స్కూల్కు ఒక్కో రకం బు క్స్.. పైన కవర్ పేజీలే మారుస్తున్నారో.. లేక లోపలి పేజీల్లో సబ్జెక్టునే మారుస్తున్నారో.. తెలియదు గానీ అంతా కలిపితే పట్టుమని రూ.430 ఉండని బుక్స్ కోసం రకరకాల బు క్స్ పేరు చెప్పి రూ.4వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తుండడం గమనార్హం.

కనీ సం రూ.300 సైతం విలువ చేయని దుస్తులను రూ.వెయ్యికి పైగా కొనుగోలు చేయిస్తు న్నారు. కొన్ని ప్రైవేటు స్కూళ్లలోనైతే రూ.5వేలకు పైమాటే.వాల్లు చెప్పిన షాపు లోనే నోట్ బుక్స్, స్కూల్ డ్రస్, షు కొనుగోలు చే యాలి. ఈ షాపు లు నిర్వహించే వారి నుం డి స్కూల్ యాజమాన్యానికి కమిషనర్ రూ పంలో భారీ గానే చెల్లింపులు జరుగుతున్నాయన్న విషయం బహిరంగ రహస్యమే. వి ద్యార్థుల నోట్ బుక్, మెటీరియల్ డ్రెస్ షూ లనుండే విద్యాసంస్థల పని చేసే వారికి జీతా లు చెల్లిస్తున్నారని విద్యార్థులు కట్టే ఫీజులు స్కూల్ స్కూల్ యాజమాన్యానికి ఆర్థిక లాభమే అంటున్నారు. ప్రతి ఏటా ఫీజులు పెంచుకుంటూ పోతున్నప్పటికీ అధికారులు నియంత్రించడం లేదు.

ఒకే జిల్లా.. ఒకే రా ష్ట్రం.. ఒక్కటే క్లాస్.. అయినా ఎందుకింత వెరియేషన్. ప్రభుత్వ స్కూళ్లలో ఫ్రీగా బుక్స్.. ఉచిత విద్య.. అంటూ చెబుతున్నా.. వాటిపై నమ్మకం లేక తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ప్రైవేటు స్కూళ్ల బాటపడుతున్నారు. పో నీ ప్రైవేటు స్కూళ్ల అంత నిపుణులైన టీచర్లు ఉన్నారా..? అంటే అది లేదు. ఇదిలావుంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రైవేటు స్కూ ళ్ల ఫీజులను అడ్డుకోవడం అధికార యం త్రాంగం ఘోరంగా విఫలమవు తోంది. చి న్న పట్టణాలు, మండల కేంద్రాల సంగతి పక్కన పెడితే.. జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు స్కూళ్లలో జరుగుతున్న దోపిడీపై కనీసం కన్నెత్తి చూడడం లేదు. ఆఖరికి జిల్లా కలెక్టర్ నిత్యం అటుగానే వెళ్తున్నా.. ఏ ఒక్క ప్రైవేటు పాఠశాలలోకి తొంగి చూడలేదు. 

 ఉమ్మడి జిల్లాపై రూ.వెయ్యి కోట్ల భారం 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికారిక గు ర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు దాదా పు 782 ఉన్నాయి. గుర్తింపులేని ప్రైవేటు స్కూల్స్ సైతం ఇబ్బడి ముబ్బడిగానే ఉన్నా యి. అయితే ఈ 782 ప్రైవేటు స్కూళ్లలో వి ద్యార్థులు 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. అయితే ఈ విద్యార్థులపై యాజమాన్యాలు అక్షరాల రూ.వెయ్యి కోట్లకు పైగానే బిజినెస్ చేస్తున్నాయి. స్కూల్ యూనిఫామ్, డ్రెస్ల కోసం ఒక్కో విద్యార్థిపై రూ.6500(రూ.5వేలు బుక్స్, రూ.1500 డ్రెస్లు) చొప్పున 2 లక్షల మంది విద్యార్థులకు లెక్కిస్తే..

దాదాపు రూ.130 కోట్లు ఖర్చు అవుతోంది. సాక్స్, షూస్, నోట్స్, పెన్నులు, పెన్సి ళ్ల ఇతరత్రాల ఖర్చు అదనమే. ఇక ఫీజుల విషయానికొస్తే.. నర్సరీకే రూ.20వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. అన్ని తరగతులకు కలిపి సగటున ఒక్కో విద్యార్థికి రూ.40వేల చొప్పున లెక్కిస్తే.. రూ.800 కోట్ల పైమాటే. ఆన్లైన్ క్లాసులు, ఫౌండేషన్ కోర్సుల ఫీజులు అదనమే.

 అంతా బహిరంగ రహస్యమే: 

ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు, మిషనరి స్కూళ్లలో బుక్స్, డ్రెసుల బిజినెస్ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. చి న్న ప్రైవేటు స్కూల్ దగ్గరి నుంచి నారాయ ణ, శ్రీచైతన్య లాంటి కార్పొరేట్ స్కూళ్ల వర కు ఈ బిజినెస్ ఓపెన్ సీక్రెట్. కానీ అధికారులెవ్వరూ ఇటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి ఉండబోదు. వాట్సాప్ల్లో మెసెజ్లు, స్పెషల్ యాప్ల్లో వేధింపులు.. అంతా బహిరంగ రహస్యమే. అయినా అధికారులకు ఇవేం పట్టవు. కనీసం ప్రైవేటు స్కూళ్లలో ఏం జరుగుతుందనే పర్యవేక్షణ పట్టే పరిస్థితి అధికారులకు లేదు. ఇక విద్యాశాఖ అసలు జిల్లాలో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వ టీచర్ల అక్రమ డిప్యూటేషన్లు, బదిలీలు, పైరవీలు, బిల్లులపై ఉన్న శ్రద్థలో కనీసం పదో వంతు ప్రైవేటు స్కూళ్లపై పెట్టినా..

విద్యార్థుల పరిస్థితి వేరుగా ఉండేది. కనీసం జిల్లా కలెక్టర్లు స్పందించినా.. కొంతలో కొంత నయం ఉండేది. పరిపాలన సౌలభ్యం కోసం మున్సిపాలిటీలు, మండలాలకు ప్రత్యేకాధికారు లను నియమించిన ట్టుగా అడ్మిషన్ల ప్రక్రియ, బుక్స్, డ్రెస్ల తంతు ముగిసేంత వరకు స్పెషల్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు బుక్స్, డ్రెస్ల అమ్మకాలకు ఏదో లైసెన్స్ ఇచ్చినట్టుగా విక్రయిస్తున్నా.. అధికారులు చోద్యం చూస్తుండడం విమర్శలకు దారితీస్తోంది.

 ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడిని అరికట్టాలి 

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడిని అరికట్టాలి. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు నోట్ బుక్స్ కు 400 రూపాయలలోపే. ఇంటర్ మెటీరియల్ కు రూ.2000 లోపే ఉంది. ఇంటర్మీడియట్ కు ప్రైవేట్ విద్యాసంస్థలు రూ.8 నుంచి రూ.10 వేల వరకు స్టడీ మెటీరియల్ పేరిట దోపిడీ చేస్తున్నాయి. నర్సరీ నుంచి ఆరో తరగతి వరకు రూ.5000 లోపు వసూలు చేస్తున్నాయి. విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలి. నోట్ బుక్ ల పేరు మీద ప్రైవేట్ విద్యాసంస్థల పేరు ఉంచి ఎమ్మార్పీ రేట్లు కంటే అధికంగా వేసి అమ్ముతున్నారు.

వారు చెప్పిన దుకాణాల్లోనే వారు చెప్పిన రేట్లకు విద్యార్థులకు కావాల్సినవన్నీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు చెప్పిన టైమ్ వరకు పుస్తకాలు, మెటీరియల్ ను కొనుగోలు చేయకపోతే విద్యార్థులలో పాఠశాలలో గంటలు తరబడి నిలబెట్టడంతో పాటు దండించడం కూడా పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరిచి ప్రైవేట్ పాఠశాలల దోపిడిని అరికట్టాలి.

పందుల సైదులు, న్యాయవాది, నల్లగొండ