అత్యధిక ఎంపీ సీట్లు బీజేపీ గెలుస్తుందిl
సామాజిక సేవలతో ‘అరూరి’కి మోదీ వద్ద గుర్తింపు
తొర్రూరు బీజేపీ సభలో రాజస్థాన్ సీఎం భజన్‌లాల్
వరంగల్, మే 9 (విజయక్రాంతి): తెలంగాణలో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపు కోసం గురువారం మహబూబాబా ద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన పార్టీ జనసభలో ఆయన మాట్లాడారు. సామాజిక సేవలతో అరూరి రమేశ్ తక్కువ సమయంలోనే ప్రధాని మోదీ వద్ద గుర్తింపు పొందార ని కొనియాడారు. ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమైందని చెప్పారు. ఇప్పుడు దేశ ప్రజలంతా మరోసారి మోదీ ప్రధాని కావాలను కుంటున్నారన్నారు. ప్రధానిగా మోదీ హ్యాట్రి క్ సాధిస్తారని కొనియాడారు.
పీవీ నరసింహారావు వంటి మహోన్నత వ్యక్తిని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డా రు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమార్కులకు అండగా నిలుస్తుందని ఆరోపించా రు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు మాయమాటలు చెప్తున్నదని మం డిపడ్డారు. అభ్యర్థి అరూరి రమేశ్ మాట్లాడుతూ.. ప్రజలకు మాయ మాటలు చెప్పి, మోసపూరిత హామీలు ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని మండిపడ్డారు. ఐదు నెలల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా కట్టు కథలు చెబుతున్నదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే తొర్రూరు డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తొర్రూరు ప్రాంతంలోని పెద్ద చెరువును మినీ ట్యాంక్‌గా మారుస్తానని, కొడకొండ్లలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.






