calender_icon.png 17 July, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ..

17-07-2025 12:48:06 AM

  1. జిల్లాలో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ మోసాలు...

బోర్డు తిప్పేసిన నిర్వాహకులు బాధితుల ఆందోళన... 

ఆదిలాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో మైక్రో ఫైనాన్స్ నిర్వాహకుల మోసాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. ఇప్పటికే పలు మోసాలు వెలుగు చూడగా తాజాగా ఆదిలాబాద్ పట్టణంలో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట కృష్ణ అనే నిర్వాకుడు కుచ్చుటోపి బిగించారు. 

ఆదిలాబాద్, ఉట్నూర్, జైనూర్ లలో బ్రాంచిలు ఓపె న్ చేసిన కృష్ణ అనే వ్యక్తి ఉద్యోగాల పేరుతో సుమారు 500లకు పైగా మంది నుండి ఒక్కొక్కరి నుండి రూ.20 వేల రూపాయలను వసూలు చేశారు. కాగా డబ్బులు కట్టిన వారు గత కొన్ని నెలలుగా ఉద్యోగం రాక, జీతం లేక డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ కార్యాలయం చుట్టూ తిరిగారు. కాగా కొన్ని రోజులుగా నిర్వాహకుడు కార్యాలయానికి తాళం వేయడంతో పాటు ఫోన్ స్వచ్ ఆఫ్ రావడంతో చివరకు మోసపోయామని గ్రహించి ఆదివారం బాధితులు డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ కార్యా లయం ముందు ఆందోళనలు దిగారు.

అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంకు వెళ్లిన బాధితులు తమ గోడును పోలీసులకు విన్నవించారు.    ప్రముఖలతో  కలిసి కార్యాలయా లు ప్రారంభించిన కృష్ణ అనే వ్యక్తి రిమ్స్ ఆసుపత్రికి సైతం కోటికి పైగా విలువ చేసే పరికరా లు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. ప్రము ఖలతో కలసి దిగిన వీడియోలు, ఫోటోలు పెట్టుకొని తమ వాట్సప్ గ్రూప్‌లో తెగ ప్రచా రం చేసుకున్నాడు. ప్రజా సేవ చేస్తున్నట్లు ప్రచారంతో నమ్మిన బాధితులు మోసపోయామని లబోదిబోమంటున్నారు.