14-10-2025 02:19:33 PM
ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరహార దీక్ష
చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ముఖ్యఅతిథిగా ప్రాంత హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజు కుమార్, విభాగ్ కన్వీనర్ సుజిత్ నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడుతూ.. మండలకేంద్రంలో బడి పక్కనే బార్ ఉన్న అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. నూతనంగా బస్టాండును నిర్మించి ఏండ్లు గడుస్తున్న ప్రారంభించడం లేదని, వెంటనే అధికారులు స్పందించకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రారంభిస్తామని హెచ్చరించారు. విద్యార్థినిలకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏర్పాటు చేయాలని అలాగే ప్రభుత్వం జూనియర్ కళాశాలలో టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.