విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
హనుమకొండ,(విజయక్రాంతి): విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీవీఏఈ జేఏసీ ట్రాన్స్కో వరంగల్ కమిటీ ఆధ్వర్యంలో నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నాకు జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 327 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్, టీఆర్వీకేఎస్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మాడ దేవేందర్ రెడ్డి, బీఎంఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికుమార్ పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ఆర్టిసన్, అన్మన్డ్, పీస్ వర్క్ కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తక్షణమే యాజమాన్యం జేఏసీ నాయకులను చర్చలకు ఆహ్వానించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 327 యూనియన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, టీఆర్వీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రపాల్, ఎన్పీడీసీఎల్ సెక్రటరీ బండారి ప్రభాకర్, కోటి, సదయ్య, ఓదెలు, బీఎంఎస్ నాయకుడు రమణారెడ్డి,బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు రంగు సత్యనారాయణ, చంద్రమౌళి, 1104 యూనియన్ నాయకులు హరిహరచారి, సురేష్, జేఏసీ ట్రాన్స్కో రాష్ట్ర కన్వీనర్ కదికొండ వెంకటేష్, హనుమకొండ జిల్లా చైర్మన్ రాంబాబు, అన్మన్డ్ కార్మిక నాయకులు బిక్షపతి, ఎన్. రాంబాబు, పూర్ణచారి, వరుణ్, ప్రవీణ్, ట్రాన్స్కో చైర్మన్ శ్రీనాథ్, ఉమ్మడి జిల్లా ట్రా న్స్కో చైర్మన్ ఐలయ్య, కన్వీనర్ కొర్ర రాజన్న, కోకన్వీనర్లు సృజన, రాజేష్, ఎన్పీడీసీఎల్ నాయకులు శ్రీధర్, సాగర్, సతీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ రెండవ తారీఖున వంటావార్పు, విద్యుత్ శాఖలో పనిచేసే కార్మికులు తమ సమస్యల పరిష్కరించాలని అన్మన్డ్, పీస్ వర్క్ కార్మికులు, సబ్ స్టేషన్ ఆపరేటర్లు, ట్రాన్స్కో ఉద్యోగులు నిరసనగా ఏప్రిల్ 2వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్కో కేంద్రాలలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా ట్రాన్స్కో ఎంప్లాయిస్ కన్వీనర్ కొర్ర రాజన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో లలో గ్రేడ్ ల వారిగా పని చేసే ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.




