13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మేరుగు శ్రీనివాస్

30-03-2026 09:15 PM

బెల్లంపల్లి, (విజయ క్రాంతి): బెల్లంపల్లి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం జరిగాయి. ఎన్నికల అధికారులుగా గోలి శ్రీనివాస్, సౌమ్య వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో  బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సీనియర్ న్యాయ వాది మేరుగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సబ్బని సాయికుమార్ లు ఎన్నికయ్యారు. మొత్తం 58 ఓటర్లు ఉండగా 56 మంది న్యాయ వాదులు  ఓటింగ్లో పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాదులు మేరుగు శ్రీనివాస్, చేను రవికుమార్ లు పోటీ చేశారు.

మేరుగు శ్రీనివాస్ కు 36 ఓట్లు రాగా రవికుమార్ కు 10 ఓట్లు వచ్చాయి. 26 ఓట్ల మెజార్టీతో మేరుగు శ్రీనివాస్ అధ్యక్షునిగా  గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రధాన కార్యదర్శి పదవికి సునీల్, సబ్బని సాయికుమార్ లు పోటీ చేశారు. సునీల్ కు 24 ఓట్లు, సాయికుమార్ కు 31ఓట్లు వచ్చాయి. ఏడు ఓట్ల మెజార్టీతో సాయికుమార్ ప్రధాన కార్యదర్శిగా గెలిచారు. బార్ అసోసియేషన్ ఈసీ మెంబర్లుగా సుధాకర్, దేవరాజు, జుబేర్ ఎన్నికైనట్లు తెలిపారు.