పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
- కార్మికుల సంఘం నాయకుల డిమాండ్
- ప్రభుత్వానికి నివేదిస్తా: ఎమ్మెల్యే ఆదినారాయణ
భధ్రాద్రి కొత్తగూడెం, జూన్ 25(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. పంచాయతీ కార్మికులకు 8 నెలలుగా వెతనాలు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికుల సమస్యలపై మంత్రి సీతక్కను, సీఎంను ఐదుసార్లు కలి సి విన్నవించినా పరిష్కారం కాలేదన్నారు. కలెక్టరేట్‌కు వచ్చిన అశ్వారావుపేట ఎమ్మె ల్యే జారే ఆదినారాయణ ధర్నానుద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల గొంతుకై సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీఇచ్చారు. అనంతరం వినతిపత్రాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు అందజేశారు.






