2 May, 2026 | 8:49 AM

ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్

26-06-2024 12:37 AM

సోనియా, ప్రియాంక, వేణుగోపాల్‌తో భేటీ

క్యాబినెట్ విస్తరణ, రుణమాఫీపై వివరణ

 హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్టంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రధానంగా రైతు రుణమాఫీ విషయాన్ని వారికి సీఎం వివరించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదుంటిని అమలు చేస్తున్న విషయాన్ని వివరించినట్లు తెలిసింది.

అంతకు ముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కూడా రేవంత్‌రెడ్డి కలిశారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణతో పాటు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేల విషయంతో పాటు ఇతర అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి వెంట మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సురేశ్ షెట్కార్, అనిల్‌కుమార్‌యాదవ్, వంశీ, రఘువీర్‌రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ తదితరులున్నారు.