calender_icon.png 29 October, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనుల ప్రొసీడింగ్స్ బహిర్గతం చేయాలి

29-10-2025 12:39:51 AM

  1. మొరం, ఇసుక అమ్ముకుంటున్న ఎమ్మెల్యే అనుచరులు 

బీఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ 

బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 28: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 22 నెలల్లోబెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గ అభివృద్ధికి రూ. 450 కోట్ల నిధులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెచ్చారని కాంగ్రెస్ నాయకులు చెప్పడం అర్థరహితమని బీఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షుడు బడికలశ్రావన్ పేర్కొన్నారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు.

బీఆర్‌ఎస్ పార్టీ హయాంలో నాటి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దుర్గం చిన్న య్యలు తెచ్చిన అభివృద్ధి పనుల ప్రొసీడింగ్స్‌ల  పనులు, పేర్లు ఎమ్మెల్యే వినోద్  మార్పించారాని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే వినోద్ స్వంతంగా రూ.450 కోట్ల నిధులు నియోజక వర్గ అభివృద్ధికి తీసుకువచ్చినట్లు తప్పుడు ప్రచారం చేయడం కాం గ్రెస్ నాయకుల నీతిమాలిన చర్య అని ఆయన విమర్శించారు.

చేపట్టిన పనులను ఎమ్మెల్యే అనుచరులు పంచుకుని 5 నుంచి 10 శాతం కమిషన్ల్లకు కాంట్రాక్టర్లను, అధికారులను వేదిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే గా గెలిచాక బెల్లంపల్లి లో ఇంజనీరింగ్, బీ ఈడీ, మండలానికో జూనియర్ కళాశాల, ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటికీ వాటి ఊసెత్తక పోవడం సిగ్గు చేటన్నారు.

సీ ఎస్ ఆర్, స్పెషల్ డెవలప్ మెంట్, నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఎన్ని నిధులు తెచ్చా రో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులు ఆయన పేరుచెప్పి అ ధి కారులను బెదిరిస్తూ ఇసుక, మొరం, అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.

పెద్దబుగ్గ రోడ్డు ఎమ్మెల్యే నే వేయించారాని గొప్పలు చెప్పడం సరికాదని, 2018లో నాటి అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రూ. 3 కోట్లు మంజూరు చేయిం చారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహించాలని హితవు పలికారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటో వతేల్చు కునేందుకు బెల్లంపల్లి పోచమ్మ గుడివద్ద భహిరంగ చర్చకు సిద్ధమా? అని ఆయన కాంగ్రస్ నాయకులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ యూత్ నాయకులు సుమన్, విజయ్, సాయి పాల్గొన్నారు.