calender_icon.png 29 October, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బరాజ్‌ల రిపేర్లు ఏజెన్సీల బాధ్యతే!

29-10-2025 12:42:30 AM

  1. అవసరమైన ప్రణాళికలు సిద్ధంచేయాలి 
  2. అన్ని డ్యామ్‌లపై స్టేటస్ రిపోర్టు తయారుచేయండి 
  3. నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష 
  4. కేంద్ర జలశక్తి సీఆర్ పాటిల్ రాసిన లేఖపై చర్చ 
  5. తుమ్మడిహట్టి నుంచి సుందిళ్లకు 80 టీఎంసీలు తరలింపు

హైదరాబాద్, అక్టోబర్ 28(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధి లోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బరాజ్‌ల మరమ్మతుల బాధ్యత సంబంధిత ఏజెన్సీలే వహించేలా చూడాలని, ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధంచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అన్ని డ్యామ్‌లపై స్టేటస్ రిపోర్టు తయారుచేయాలని సూచించారు.

మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నీటిపారుదల శాఖపై సమీక్షించ డంతోపాటు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఇటీవల సీఎంకు పంపి న లేఖపై కూడా అధికారులతో రేవంత్ చర్చించారు. లేఖలో ప్రస్తావించిన అంశాలను అధికారులకు సీఎం వివరించి వాటిపై ఏ విధంగా ముం దుకెళ్లాలనే దానిపై పలు సూచనలు చేశారు.

లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టు వారీగా విశ్లేషణలు చేసి పూర్తిస్థాయి నివేదికలను తయారు చేయాలని అధికారులను సీ ఎం ఆదేశించారు. ప్రాజెక్టులవారీగా పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండోవారంలో మరోసారి సమీక్ష సమావే శం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. 

సుందిళ్లకు 80 టీఎంసీలు..

తుమ్మిడిహట్టి వద్ద చేపట్టాల్సిన ప్రాజెక్టుపై కూడా ఈ సమీక్షలో ముఖ్యమంత్రి చర్చించారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన ప్ర ణాళికలు సిద్ధంచేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాకు సాగు నీరు, తాగు నీరు అందించేందుకు ప్రణాళికలు రూ పొందించాలన్నారు. ఇందుకు పాత పనులను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లేందుకు అంచనాలను తయారు చేయాలని సూచించారు.

సుందిళ్లను రిపేరు చేసి వినియోగంలోకి తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లికి నీ టిని తెచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధంచేయాలని అధి కారులను సీఎం ఆదేశించారు. ఈ స మావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.