29-10-2025 12:37:46 AM
నకిరేకల్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): పత్తి కొనుగోళ్లలో తేమ శాతం ఎక్కువగా ఉంటే కొనబోమని అధికారులు చెబుతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రక టించిన మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో నకిరేకల్--అర్వపల్లి రహదారిపై పత్తి రైతులు ఆందోళనకు దిగారు.
శాలిగౌరారం మండల పరిధిలోని మాదారం కలాన్ టీఆర్‌ఆర్ కాటన్ మిల్ వద్దకు రైతులు పత్తి తీసుకొచ్చారు. అక్కడ తేమ శాతం 12కు మించి కొనబోమని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లు వద్ద నకిరేకల్--అర్వపల్లి రహదారిపై పత్తిని తగులబెట్టి ఆందోళన చేపట్టా రు. కొనుగోలు కేంద్రాలకు వ్యయ ప్రయాసలకు ఓర్చి తీసుకొచ్చిన పత్తిని, తేమ శాతం ఎక్కువగా ఉంద నే సాకుతో తిరిగి వెనక్కి పంపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పంట పండించడం ఒక ఎత్తుయితే.. అమ్మ డం అంతకుమించి భారంగా మారిందని వాపోయారు. సీసీఐ కొనుగో లు కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెడుతూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిం చారు. ఈ విషయంపై ప్రభుత్వం వెం టనే స్పందించి, తేమ శాతంతో సం బంధం లేకుండా పత్తి కొనాలని డి మాండ్ చేశారు.