12 May, 2026 | 1:23 AM

గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు

12-05-2026 12:21 AM

తాడ్వాయి, మే, 11( విజయక్రాంతి): రైతులకు అందుబాటులో ఉండేందుకు గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తాడువాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం గ్రామంలో సోమవారం ఆయన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బయట మార్కెట్లో దళారులకు మక్కలను విక్రయించవద్దని సూచించారు. బయట మార్కెట్లో దళారులు మక్కలకు తక్కువ ధర చెల్లిస్తున్నారని తెలిపారు. దీంతో రైతులు మోసపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలు విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, నాయకులు పాల్గొన్నారు.