2 July, 2026 | 10:52 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

టీఎఫ్‌సీసీలో సంచలనం.. ఎన్నికైన 24 గంటల్లోనే

08-06-2025 07:30 PM

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(Telangana State Film Chamber of Commerce) అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్(Producer Suniel Narang) రాజీనామా చేశారు. ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే తన పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనను సంప్రదించకుండానే కొందరు ప్రకటనలు ఇస్తున్నారని, తన ప్రమేయం లేకుండా ఇచ్చిన ప్రకటనలకు బాధ్యుడిని కాదని సునీల్ నారంగ్ వెల్లడించారు.

ఇలాంటి పరిస్ధితుల దృష్టా పదవిలో కోనసాగలేను అని స్పష్టం చేస్తూ నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామాను ప్రకటించారు. కాగా, శనివారం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్‌గా ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్స్‌గా రవీంద్ర గోపాల, ఉదయ్‌కుమార్‌రెడ్డి కే, సెక్రటరీగా శ్రీధర్ వీఎల్, జాయింట్ సెక్రటరీగా చంద్రశేఖర్‌రావు జే, ట్రెజరర్‌గా సత్యన్నారాయణ గౌడ్ బీ ఎన్నికయ్యారు.