17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి అవసరం

28-06-2025 02:03 AM
  1. విద్యుత్ ఒప్పందాల అమలుపై  రోజువారి సమీక్షలు చేయండి 
  2. జెన్ కో అధికారులు, డైరెక్టర్ల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క   

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): రాబోయే పదేళ్లలో రాష్ర్టంలో ఏర్పడనున్న విద్యుత్ డిమాండ్ అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్‌లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, జెన్కో డైరెక్టర్లతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.

2023, మార్చిలో వచ్చిన 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్, 2025, మార్చిలో వచ్చిన 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని 2029 నాటికి ఎంత మేరకు డిమాండ్ పెరుగుతుందో అలాగే 2030 2047 సంవ త్సరాలకు ఏర్పడే విద్యుత్ డిమాండ్ అందు కు అనుగుణంగా వివిధ మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదే శించారు.

వీటితో పాటు రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, మూసీ పునర్జీవనం, పెరుగుతున్న పరిశ్రమలు, వ్యవసాయ వినియోగం, మారిన జీవన ప్రమా ణాలకు అనుగుణంగా పెరగనున్న విద్యుత్ వినియోగం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అంచనాలు రూపొందించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.

30 లక్షల పంప్‌సెట్లకు నిరంతర విద్యుత్..

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ర్టంలో సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు రాష్ర్ట ప్రభుత్వం 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తుందని, ఇందు కు గాను విద్యుత్ సంస్థలకు ఏడాదికి రూ. 12,500 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. నిరుపేదలకు ఆర్థిక చేయూతను అందించేందుకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని..

ప్రస్తుతం వీటి విలువ రూ.2 వేల కోట్ల వరకు ఉందన్నారు. అది భవిష్యత్తులో పెరిగి మూడు వేల కోట్ల వరకు చేరుకొనే అవకాశం ఉందన్నారు. మొత్తంగా ఉచిత విద్యుత్ పథకాలకు భవిష్యత్తులో 17 వేల కోట్ల వరకు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని వివరించారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గ్రీన్ ఎనర్జీని పెద్దఎత్తున ఉత్పత్తి చేసేం దుకు ప్రణాళికలు చేసుకోవాలన్నారు.

హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో చేసు కున్న విద్యుత్ ఉత్పత్తి ఒప్పందలపై రోజువారి సమీక్ష చేయాలని డిప్యూటీ సీఎం ఉన్న తాధికారులను ఆదేశించారు. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహాలపై సోలార్ పవర్ ప్యానల్స్ ఏర్పాటు చేసి ఆ యావర్గాలకు ఆదాయంతో పాటు, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రణాళికలను వేగవంతం చేయాలన్నారు. సమా వేశంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ట్రాన్‌స్కో సీఎండీ కృష్ణ భా స్కర్, జెన్‌కో సీఎండీ హరీశ్, రెడ్కో వీసీ అనిలా తదితరులు పాల్గొన్నారు.