12 July, 2026 | 4:16 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

బాన్సువాడలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు..

06-08-2025 04:38 PM

జయంతి వేడుకల్లో పాల్గొన్న సబ్ కలెక్టర్ కిరణ్మయి..

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ(Banswada) పట్టణంలోనీ ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి చూపిన బాటలో నడవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి(Sub-Collector Kiranmayi) తెలిపారు. అలాగే  పట్టణంలోని జయశంకర్ కాంస్య విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ తరపున నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతికే జాతిపిత అని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ విద్యావంతుడు యూనివర్సిటీ ప్రొఫెసర్ అనేక మంది విద్యార్థులను తెలంగాణ ఉద్యమంలో పాల్గొని విధంగా కృషి చేశారని అన్నారు.

తెలంగాణ ఉద్యమం నీరుగారే సమయంలో మేధావులను విద్యార్థులను ఏకం చేసి ఉద్యమాలు ఉవ్వెత్తున లేసే విధంగా కృషి చేశారు ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయం విద్యార్థులకు వివరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తకొండ భాస్కర్ మాసాని శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షుడు గణేష్ మాసాని శేఖర్ రెడ్డి లాయక్ పాత బాలకృష్ణ వెంకట్ రెడ్డి అక్బర్ దివిటీ శ్రీనివాస్ యాదవ్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.