06-08-2025 04:40:21 PM
బాన్సువాడ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు బీర్కూరు మండల(Birkoor Mandal) కేంద్రంలో పోలింగ్ బూత్ సంపర్క్ అభ్యాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పోలింగ్ బూత్ లు 169, 172, 173, 174 బూత్ లాల్లో బూత్ కమిటీ సభ్యులతో వారి పోలింగ్ బూతులలోని ప్రతి ఇంటికి వెళ్లి డోర్ స్టిక్కర్, పాంప్లెట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అన్ని ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు నాగేళ్ల. సాయికిరణ్ అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి మల్లెల యోగేశ్వర్ మండల ఉపాధ్యక్షులు చేపూరి హనుమాన్లు, వడ్ల బసవరాజ్, మండల యువమోర్చా అధ్యక్షులు వినీష్ మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు, సాయిలు బిజెపి సీనియర్ నాయకులు లక్క పల్లి, పోచి గోండ, ఉప్పు శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.