06-08-2025 04:36:01 PM
మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్..
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డులో బుధవారం దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభం నాటి నుండి డ్రైనేజీలో ఇంటి పరిసరాల ప్రాంతాల్లో పేర్కపోయిన మురికి నీరుపై దోమలు వ్యాపించడంతో వాటి నివారణకు దోమల మందును పిచికారి చేయించి దోమల నివారణకు ప్రత్యేక దృష్టి సాధిస్తున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు డ్రైనేజీలో శుభ్రం కాలనీలో ఎలాంటి చెత్తాచెదారం లేకుండా మున్సిపల్ కార్మికుల ద్వారా శుభ్రపరచడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.