2 June, 2026 | 8:14 PM

వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

02-06-2026 07:40 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో  వైభవంగా జరిగాయి, స్థానిక కోర్టులో పెద్దపల్లి జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ భవాని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఇందులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వోడ్నాల రవీందర్, అడ్వకేట్లు పాల్గొన్నారు, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ బషీరుద్దీన్, పోలీస్ స్టేషన్లో సీఐ రంజిత్ రావ్, ఎస్సై చంద్ర ప్రకాష్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ బిరుదు రాధాకృష్ణ,  వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు తోపాటు పలుచోట్ల అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

అలాగే సుల్తానాబాద్ మండలంలోని గ్రామాల్లోనూ ప్రజా ప్రతినిధులు,  అధికారులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను  అధ్యక్షులు పారుపల్లి గుణపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ తాటిపల్లి రాజలింగం ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.