calender_icon.png 2 February, 2026 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

02-02-2026 12:17:41 AM

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల విలీనం, మూ సివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. ప్రతి గ్రామంలో పాఠశాల ఉండాలని, ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు, గది కల్పించాలని కోరారు. విద్యారంగానికి తగిన బడ్జె ట్ కేటాయించి ఖాళీలను వెంటనే భర్తీ చే యాలని డిమాండ్ చేశారు. పాఠశాలల మూసివేత ఆపకపోతే గ్రామ గ్రామాన వి ద్యా ఉద్యమం చేపడతామని హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో ఎం.ఎన్. కిష్టప్ప, ఎం. రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.