15 June, 2026 | 2:05 AM

మర్రి లక్ష్మణ్‌రెడ్డి, అరుంధతిల వివాహ వార్షికోత్సవానికి ప్రముఖుల హాజరు

15-06-2026 12:57 AM

మేడ్చల్, జూన్ 14(విజయ క్రాంతి): మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తల్లిదండ్రులు మర్రి లక్ష్మణ్ రెడ్డి, అరుంధతి వివాహ వార్షికోత్సవానికి వివిధ రంగాల ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ సమీపంలోని మునిరాబాద్ లోని ఒక ఫంక్షన్ హాల్లో లక్ష్మణ్ రెడ్డి అరుంధతిల 60వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్పీకర్ ప్రసాదరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు హరీష్ రావు, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ సుంకరి రాజు, కుటుంబ సభ్యులు మర్రి మమత రాజశేఖర్ రెడ్డి, ఆదిత్య రెడ్డి, అను శ్రీయ రెడ్డి, మర్రి ధీరన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.