శ్రీధర్మశాస్త్ర సేవాసమితి సన్నిధానం స్వాముల ఆత్మీయ సమ్మేళనం
ఘట్ కేసర్, జూన్ 14 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణం శివారెడ్డిగూడ లోని శ్రీదండ్లగడ్డ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం ఆవరణలో ఆదివారం శ్రీధర్మశాస్త్ర సేవా సమితి సన్నిదానం స్వాముల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి వ్యవస్థాపకులు బర్ల ఆంజనేయులుముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెజారిటీ సభ్యులు సమావేశంలో చర్చించి ఏకగ్రీవంగా పలు తీర్మాణాలు చేశారు. ప్రస్తుతం ఉన్న కార్యనిర్వాహక కమిటీని తాత్కాలికంగా నిలిపివేయాలని,
గతంలో సన్నిదానoలో జరిగిన విధంగానే అయ్యప్ప పూజలు కొనసాగించాలని తీర్మాణించారు. ప్రస్తుత పరిస్థితిని అనుసరించి మన సంస్కతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని, అందులో మనం అందరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జగదీశ్ గౌడ్, శంకర్, రామతీర్థగౌడ్ హరినాథ్, లక్ష్మణ్, ఎల్లయ్య, నరేశ్ గౌడ్, మహేందర్, కష్ణగౌడ్, రాజు, శ్రావణ్ కుమార్, శివదీపక్, బాలకృష్ణ, శ్రీనివాస్, రవికాంత్, గురునాథ్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.






